బాబు అలా చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, January 3rd, 2021, 02:18:31 PM IST

రామతీర్థం ఆలయం వద్ద జరుగుతున్న పరణామాల పై ప్రతి పక్ష పార్టీ, అధికార పార్టీ నేతలు ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అను కుల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తాడు అంటూ చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలు ససేమిరా విప్పేది లేదంటాడు అంటూ విమర్శించారు. భక్తి గురించి, మత విశ్వాసాల గురించి ఈయన ప్రవచనాలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంటూ విమర్శించారు.

అయితే అంతకుముందు బూటు కాళ్ళతో చంద్రబాబు నాయుడు రామతీర్థం వద్దకు వెళ్లడం పట్ల పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రాజకీయ లబ్ది కోసం పాకులాడే బాబుకు దేవుడి పై భక్తి, సంప్రదాయాల పై వీసమెత్తు గౌరవం కూడా లేదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.