ఇవన్నీ పాతకాలం నాటి చీప్ ట్రిక్స్…బాబు పై విజయసాయి రెడ్డి సెటైర్స్

Tuesday, December 29th, 2020, 09:24:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇళ్ళ పట్టాల పంపిణీ తో సంక్రాంతి ముందే వచ్చింది అని ఆడపడుచులు ఆనంద పడుతుంటే వారి దృష్టి మళ్ళించే కుట్రలు మొదలు పెట్టాడు బాబు అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పాతకాలం నాటి చీప్ ట్రిక్స్ అంటూ బాబు పై సెటైర్స్ వేశారు. మీ అరుపులు, పెడబొబ్బలకి బదులు ఇచ్చేంత తీరిక లేదు ఎవ్వరికీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యజ్ఞంలో తీరిక లేకుండా మా వాళ్లంతా అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పాలన విధానం పై ప్రశంసల వర్షం కురిపించడం మాత్రమే కాకుండా జై జగన్ అంటూ నినదిస్తున్నారు. కొందరు టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ కి చెందిన పలువురు అభిమానులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.