ఎన్నికలప్పుడు బాబు దిగజారి మరీ దుష్ప్రచారం చేశాడు

Saturday, December 26th, 2020, 09:10:32 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అధికార పార్టీ వైసీపీ తలపెట్టిన పలు పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వారి పై మరొకసారి కౌంటర్ ఎటాక్ చేశారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. వైసీపీ వస్తే రాయలసీమ రౌడీలు మీ భూములను ఆక్రమిస్తారు అని, మీ ఇంటి నుండి మిమ్మల్ని గెంటేస్తారని ఎన్నికలప్పుడు బాబు దిగజారి మరీ దుష్ప్రచారం చేశాడు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బ్యాంకుల నుండి 8 వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన రాయపాటి ఎవరూ అంటూ చంద్రబాబు ను సూటిగా ప్రశ్నించారు. విశాఖ లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేసిందెవరు? మీ వాళ్లేగా బాబు అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులు తమ వద్ద ఆధారాలు ఉంటే అధికారం లో ఉన్నది వైసీపీ కాబట్టి ఇప్పుడు శిక్షించే అధికారం ఉండి ఇంకా ఎందుకు ఇలాంటి ఆరోపణలు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం గతంలో విజయసాయి రెడ్డి జైలు కి వెళ్లి గడిపిన రోజుల్ని గుర్తు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.