సీఎంగా 14 ఏళ్లు పని చేసిన వ్యక్తి క్రిమినల్ సలహాలిస్తున్నాడు

Thursday, December 17th, 2020, 07:30:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. జూమ్ ద్వారా చంద్రబాబు చేసే నీచ కుట్ర రాజకీయం బట్టబయలు అయింది అని అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం మానేసి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల పై కేసులు పెట్టి వేధించాలనీ దిశా నిర్దేశం చేస్తున్నాడు అంటే ఎంతగా దిగజారాడో అంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు తమ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలను ఎంపీ విజయసాయి రెడ్డి ఒక వీడియో క్లిప్ రూపం లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే సీఎంగా 14 ఏళ్లు పని చేసిన వ్యక్తి క్రిమినల్ సలహాలు ఇస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మీద కేసులు పెట్టీ కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలి అంట అని అన్నారు. అయితే ప్రజల మనసులు గెలవాలి అని సలహాలు ఇస్తారు ఎవరైనా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.ఈయన పోలీసులను బ్లాక్ మెయిల్ చేసి కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు అని విమర్శించారు.