నేడు అచ్చెన్నాయుడు నినాదం… పార్టీ లేదు బొక్కా లేదు – ఎంపీ విజయసాయి రెడ్డి

Wednesday, April 14th, 2021, 11:35:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు అని ప్రస్తావిస్తూ, టీడీపీ ను స్థాపించిన ఎన్టీఆర్ నినాదం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ చెప్పుకొచ్చారు. అయితే నేడు తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నినాదం అని చెబుతూ, పార్టీ లేదు బొక్కా లేదు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే మరొక ట్వీట్ లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ల పై ఘాటు విమర్శలు చేశారు. సినిమా ప్రమోషన్ లలో హీరో, హీరోయిన్లు, కమెడియన్లు పాల్గొని వాళ్ళ తిప్పలు ఏవో వాళ్ళు పడతారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్యాకేజి స్టార్ రీమేక్ మూవీ కోసం బాబు, అనుకుల మీడియా, బీజేపీ పెద్దలు పోస్టర్లు అతికించే స్థాయికి దిగజారడం రాజకీయాలకు దాపురించిన దరిద్రం కాక మరేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేయడం తో జన సేన పార్టీ కి చెందిన కార్యకర్తలు, అభిమానులు స్పందిస్తున్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు వైసీపీ తీరు పట్ల సెటైర్స్ వేస్తున్నారు.