పాదయాత్ర చేయనున్న ఎంపీ విజయసాయి రెడ్డి… ఎందుకంటే?

Tuesday, February 16th, 2021, 05:00:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ను వ్యతిరేకిస్తూ 23 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే జీవీఎంసి గాంధీ విగ్రహం నుండి కుర్మాన్న పాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వరకూ పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ నెల 20 వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగనుంది. అయితే ఈ పాదయాత్ర అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఇందుకు సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.