ఇది రైతు ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఏం కావాలి?

Wednesday, November 11th, 2020, 07:26:57 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి పెద్ద పీఠ వేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అయితే అధికారం చేపట్టిన 17 నెలల్లోనే దాదాపు 90 శాతానికి పైగా హామీలను నెరవేర్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇదే విజయాన్ని వైసీపీ నేతలు ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే వైఎస్సార్ జలకళ పథకం గురించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

2 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వమే బోర్లు తవ్వించే జలకళ స్కీం లాంటిది ఇంకే రాష్ట్రమైనా అమలు చేస్తుందేమో ఎవరైనా చూపించగలరా అంటూ ప్రతి పక్ష పార్టీ నేతలకి పరోక్షంగా ప్రశ్న వేశారు. మోటార్లు కూడా ఫ్రీ గా అందజేసి 5 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అని తెలియజేశారు. ఇది రైతు ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఏం కావాలి అంటూ విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైఎస్సార్ జలకళ పథకం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.