జగనన్న విద్యా కానుక పథకం పై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Wednesday, October 7th, 2020, 06:40:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ అధికారం చెప్పటిన అనంతరం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే మరో ప్రతిష్టాత్మక పథకం అమల్ అయ్యేందుకు సిద్దం గా ఉంది. అదే జగనన్న విద్యా కానుక పథకం. ఈ నెల 8 వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పునాది పాడు లో జిల్లా పరిషత్ పాటశాల లో ప్రారంభించనున్నారు. అయితే ఈ మేరకు ఈ పథకం గురించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.

జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందనున్నారు అని తెలిపారు. కొత్త సిలబస్ తో ఉన్నటువంటి పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్ లు, బెల్ట్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ తో పాటుగా కొన్ని వస్తువులను అందిస్తున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే మొదటి తరగతి నుండి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారు అని అన్నారు.