నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా… మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా

Tuesday, February 9th, 2021, 01:04:42 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పై చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయం గా మారాయి. అయితే మనిషి ఒక చోట, ఆయన మనసు మరో చోట ఉందని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలకి వివరణ ఇస్తూ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. వెంకయ్య నాయుడు పై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు తెలిపారు. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా అని వ్యాఖ్యానించారు. అయితే అవి ఉద్దేశ్య పూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు అని, ఆవేశం లో మాట్లాడినట్లు సభ లో తెలిపారు. రాజ్యసభ చైర్మన్ ను అగౌరవ పరచాలి అని అనుకోలేదు అంటూ వివరణ ఇచ్చారు.

అయితే టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడ బోతుండగా, వెంకయ్య నాయుడు ఖండించారు. అయితే సోషల్ మీడియా వేదిక గా విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ పై జగన్ గారు చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుంది అని ప్రధానికి లేఖ రాశారు అంటూ చెప్పుకొచ్చారు. అవసరం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తామే కొనుగోలు చేస్తాం అంటూ ముందుకు వచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించింది రాష్ట్రం అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.