బిగ్ న్యూస్: జగన్ ఆమోదం తర్వాత గంటా వైసీపీ లోకి వచ్చే అవకాశం ఉంది – విజయసాయి రెడ్డి

Wednesday, March 3rd, 2021, 02:00:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ లోని కీలక నేతలు అంతా కూడా అధికార పార్టీ వైసీపీ లోకి చేరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత గత రెండేళ్ల లో ఎంతోమంది వైసీపీ లోకి చేరారు. ఈ మేరకు వైజాగ్ కి చెందిన తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీ లోకి చేరే అవకాశం ఉందని వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.గంటా అనుచరుడు అయిన కాశీ విశ్వనాథ్ వైసీపీ లో చేరారు. అయితే ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ పాలన చూసి చాలామంది వైసీపీ లోకి చేరుతున్నారు అని వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాస రావు కొన్ని ప్రతిపాదనలు పంపారు అని వెల్లడించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తర్వాత గంటా పార్టీ లోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే గంటా శ్రీనివాస రావు చేరిక ప్రతి పాదన ను మొడటి నుండి కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. అయితే అప్పటికి కాశీ విశ్వనాథ్ చేరిక సమయం లో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే గంటా శ్రీనివాస రావు వైసీపీ లోకి చేరడం పట్ల గతం లో నూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైసీపీ కి చెందిన కీలక నేత విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తో సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.