ప్రధాని మోడీ తో భేటీ ఫలప్రదం – విజయసాయి రెడ్డి

Wednesday, October 7th, 2020, 01:08:23 AM IST


ప్రధాని నరేంద్ర మోడీ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ఫలప్రదంగా జరిగింది అని అధికార పార్టీ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్లు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కి ఎంపీ విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం దాదాపు 50 నిమిషాలకి పైగా జరిగినట్లు తెలుస్తోంది.

అయితే ఈ భేటీ లో ముఖ్యం గా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిల తో పాటుగా, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, ఇతర కీలక 17 అంశాల పై ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ నివేదించినట్లు తెలుస్తోంది.