రాష్ట్రంలో నవశకం మొదలవుతుంది – విజయసాయి రెడ్డి

Friday, October 30th, 2020, 08:30:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగం ను అభివృద్ది చేసేందుకు మరొక ముందడుగు వేశారు. కొరియన్ కి చెందిన పొస్కో స్టీల్ ఉత్పత్తి కంపనీ పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీ తో పారిశ్రామికంగా రాష్ట్రంలో నవశకం మొదలవుతుంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 30 వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ కర్మాగారం వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుంది అని అన్నారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చో రవను ప్రశంసించడం యువ సీఎం జగన్ గారి సంకల్పాన్ని బలపరిచినట్టయింది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పై విమర్శలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన అనంతరం నుండి ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చేయలేదు అని, పోలవరం, అమరావతి విషయాల పై కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ను ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.