ఈ కేసులో సీబీఐ ఏం చేస్తుందో అని దేశమంతా ఎదురుచూస్తోంది!

Tuesday, September 29th, 2020, 08:40:19 PM IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తో యావత్ భారత దేశం ఈ కేసు పై ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూ ఉంది అని, ఈ కేసులో సీబీఐ ఏం చేస్తుందో అని దేశమంతా ఎదురు చూస్తోంది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహారాష్ట్ర లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలను ఈయన తోసి పుచ్చారు. అలా జరిగే అవకాశం లేదు అని, ప్రజలు మధ్యంతర ఎన్నికలు కోరుకోవడం లేదు అని తెలిపారు.

అయితే గుప్తేశ్వర్ డీజీపీ గా కొనసాగిన సమయం లో ముంబై పోలీసుల పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించి న విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ముంబై పోలీసులను కించ పరుచవద్దు అని సూచించిన విషయాన్ని మరోమారు ఆయన మీడియా తో అన్నారు. బాలీవుడ్ హీరో మృతి పై ముంబై పోలీసుల విచారణ తప్పు పట్టిన గుప్తేస్వర్ సీబీఐ దర్యాప్తు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు అదే విషయం పై ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది అని, సీబీఐ ఏం చెప్తుందో అని దేశమంతా ఎదురు చూస్తుంది అని తెలిపారు.