సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ..!

Monday, February 15th, 2021, 07:29:11 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయాన్ని ప్రస్తావిస్తూ వాటిని నెరవేర్చకపోవడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పింఛన్ అర్హత వయస్సు ను 57 ఏళ్లకు తగ్గించాలి అని, అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ ఫించన్ ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే రెండోసారి అధికారం లోకి వస్తే అర్హులందరికీ ఫించన్ ఇవ్వడం తో పాటుగా అర్హత వయస్సు ను 60 నుండి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే రాష్ట్రంలో ఫించన్ల పంపిణీ తీరు చూస్తే ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పై సెటైర్స్ వేశారు. అంతేకాక ఏళ్లు గడుస్తున్నా హామీల అమలు లో ఎలాంటి పురోగతి లేదు అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంట్లో ఇద్దరు వృద్దులు ఉంటే ఇద్దరికీ ఫించన్ ఇవ్వాలి అని, 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిళలను గుర్తించి వారికి వెంటనే ఫించన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మరొకసారి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఎలా స్పందిస్తారో చూడాలి.