ఎంపీ రేవంత్ రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్

Tuesday, March 23rd, 2021, 03:22:22 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశం లో మళ్లీ ఊహించని రీతిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణ లో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. అయితే తాజాగా టిపిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి కి కరోనా వైరస్ సోకింది. అయితే తనకు కొవిడ్ సోకిన విజయాన్ని రేవంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా చేయించుకున్న కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు రేవంత్ తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.