వారి పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గం – ఎంపీ రేవంత్ రెడ్డి

Friday, November 27th, 2020, 07:43:30 AM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎం ఐ ఎం నేతలు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ల పై చేసిన వ్యాఖ్యలకి బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే బీజేపీ, ఎం ఐ ఎం నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ పరాయి నేతల పై ప్రేమ ఒలకబోస్తుంది అని, అద్వానీ మరియు జోషి తదితర నాయకులకు ఆ పార్టీ గౌరవం ఇవ్వలేక పోయింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ల పై ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి అంటూ బీజేపీ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 29 వ తేదీన మహ నగరం హైదరాబాద్ కి వస్తున్న బీజేపీ అగ్ర నేతలు మహ నేతల ఘాట్ లను సందర్శించి, అక్కడ ఈ ప్రకటన చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.