హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదు – రేవంత్ రెడ్డి

Monday, November 23rd, 2020, 01:37:21 PM IST

తెలంగాణ లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావడం తో ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ పై ఘాటు విమర్శలతో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు సోమాజిగూడ లో మీడియా తో మీడియా తో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వందల మంది ఆత్మ బలిదానాల తో తెలంగాణ సాధించుకున్నాం అని, కొన్ని వందల ఏళ్ల క్రితమే నిజాం పాలకులు ఎన్నో అభివృద్ది పనులు చేశారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన కొనసాగుతుంది అని అన్నారు.

తెరాస వలనే మెట్రో వ్యయం పెరిగింది అని, ఎం ఐ ఎం కోసం గౌలి గూడ వరకు మెట్రో నిలిపి వేశారు అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తో 3500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని, మాయ మాటలతో కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు అని, 67 వేల కోట్ల రూపాయల తో హైదరాబాద్ ను అభివృద్ది చేశామని అనడం పచ్చి అబద్దం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా నగరానికి పెట్టింది ఆరు వేల కోట్లు రూపాయలు మాత్రమే అని, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కలిపి చూపిస్తున్నారు అని రేవంత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద భీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదు అని, పాలకుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. అంతేకాక హైదరాబాద్ నగరానికి, ప్రజలకు టీఆర్ఎస్ చేసిందేమీ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.