బిగ్ న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది కోసమే…మంత్రి కేటీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ!

Thursday, March 11th, 2021, 02:10:37 PM IST

KTR_RevanthReddy

తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై, తెరాస నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పై పార్లమెంట్ లో పోరాటానికి తెరాస ఎంపీ లు ముఖం చాటేశారు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ఎంపీ లు పార్లమెంట్ కి ఎందుకు రావడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించిన రేవంత్, మోడీ అంటే భయపడుతున్నారా అంటూ విమర్శించారు.

మోడీ కి భయపడుతున్నారా లేక రాజీ పడుతున్నారా అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే బీజేపీ పై గల్లి లో మీ మాటలకు, ఢిల్లీ లో మీ చేతలకు పొంతన లేదు అని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో లబ్ది కోసమే విశాఖ ఉక్కు పోరాటానికి మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు అంటూ ఆరోపణలు చేశారు. అయితే విభజన చట్టం లో తెలంగాణ కి రావాల్సిన దాని పై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా అంటూ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి సూటి ప్రశ్నలు వేశారు. అయితే రేవంత్ రెడ్డి రాసిన లేఖ కి కేటీఆర్, తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.