సీఎం కేసీఆర్ తీరు పై రేవంత్ రెడ్డి సీరియస్…వారికి నష్ట పరిహారం ఇవ్వాలి!

Wednesday, August 19th, 2020, 10:57:25 PM IST


తెలంగాణ రాష్ట్రం లో గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి, రోడ్ల మీద నీరు చేరుకుంటున్నాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగిపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదల వల్ల జరిగినటువంటీ పంటల నష్టం తీవ్రత అర్దం కావడం లేదా అని రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించారు.

అయితే సీఎం కేసీఆర్ కి రాసిన లేఖ లో రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. భీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం కల్గించారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. రైతులకు 20 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అంటూ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెయ్యి కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు ను విడుదల చేయాలని కోరారు. అంతేకాక నష్టపోయిన రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి అని తెలిపారు.