వైసీపీ సర్కార్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు..!

Wednesday, November 4th, 2020, 05:00:22 PM IST

వైసీపీ సర్కార్‌కు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఏపీలో స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నప్పుడు లేని కరోనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తేనే వస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఈసీగా ఉంటే ఏకగ్రీవాలు జరగవని వైసీపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు.

అయితే ప్రజల ఆరోగ్యం గురుంచి ఆలోచించే వారు కరోనా సమయంలో మద్యం సాపులు ఎందుకు తెరిచారో సమాధానం చెప్పాలని అన్నారు. మద్యం షాపులు తెరిచినప్పుడు కరోనా నిబంధనలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, మరి ఏపీలో ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకు నో చెబుతుందని అన్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించి ఎన్నికలకు సిద్ధం కావాలని లేదంటే కోర్టులతో మళ్లీ మొట్టికాయలు తప్పవని అన్నారు.