తనను ఎవరూ తొలగించలేదు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు క్లారిటీ..!

Saturday, October 17th, 2020, 03:00:52 AM IST

Raghurama-Krishnam-Raju
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో ఆ పదవిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేటాయించారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన రఘురామ తనను ఎవరూ తొలగించలేదని, తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు. మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి నన్ను తొలగించాలని వైసీపీ ఎంపీలు అంతా కలిసి స్పీకర్‌కు లేఖ ఇచ్చారని అన్నారు.

అయితే ఆ పదవి ఏడాది కాలం పాటు ఉంటుందని మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు నా పదవి కాలం అయిపోయింది కాబట్టి మరో ఎంపీ బాలశౌరికి ఇచ్చారని అన్నారు. రెడ్లకు పదవులు ఇవ్వడం అయిపోయింది కాబట్టి ఇక ఆయన మతానికి చెందిన బాలశౌరికి ఆ పదవి ముష్టి వేశారని అన్నారు. ఇదంతా తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటుందని అన్నారు.