ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రఘురామ.. ఎందుకంటే?

Wednesday, October 28th, 2020, 03:13:15 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది చర్చి ఫాస్టర్లకు నెలకు 5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసిందని ఈ చర్య రాష్ట్రంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు దోహదపడుతుందని అందుకే దీనిని తప్పుపడుతున్నట్టు రఘురామ తెలిపారు.

అయితే ప్రజల డబ్బును క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగించడం నిజంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు. ఇదిలా ఉంటే 2011లో 1.8 శాతం ఉన్న క్రిస్టియన్ జనాభా ఇప్పుడు 25 శాతం వరకు మత మార్పిడి ద్వారా పెరిగిందని కానీ ఇది ప్రభుత్వ రికార్డుల్లో కనిపించడం లేదని, ఇలా మారిన వాళ్ళు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి చట్ట సభలకు కూడా వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సమానంగా చర్చిలు ఏర్పాటు అయ్యాయని, సుమారు 33 వేల చర్చిలు ఏర్పాటు అయినట్లు సమాచారం ఉందని తెలిపారు.