ప్రధాని మోడీ కి రఘురామ కృష్ణంరాజు లేఖ… ఏం ప్రస్తావించారంటే?

Wednesday, December 30th, 2020, 02:13:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గత 18 నెలలు గా దేవాలయాల పైన, విగ్రహాల పైన జరిగిన దాడుల గురించి ప్రస్తావిస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల పై దాడులు, విగ్రహాల ధ్వంసం పై రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ లో ఆలయాల పై దాడులు పెరిగాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామ తీర్థం లో విగ్రహాల ను ఇటీవల దొంగతనం చేశారు అంటూ లేఖ లో పేర్కొన్నారు.గత 18 నెలలు గా 100 కి పైగా విగ్రహాల పై దాడులు జరిగాయి అని పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కి రఘురామ కృష్ణంరాజు ఆలయాల పై జరుగుతున్న దాడుల విషయం పట్ల లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.