ప్రధాని మోడీకి రఘురామ కృష్ణంరాజు లేఖ…ఎందుకంటే?

Sunday, January 10th, 2021, 10:10:43 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే భారత్ లో వాక్సిన్ కి ఆమోదం కూడా లభించిన సంగతి తెలిసిందే. అయితే దశల వారీగా ఈ వాక్సిన్ ను వేసే ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ వాక్సిన్ వేయడం ఉంటుంది. అయితే ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఈ లేఖ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. అయితే ప్రజా ప్రతినిధులు అయిన, ఎంపీ లు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లకు ఫ్రంట్ లైన్ వారియర్ లతో పాటుగా తొలి దశలోనే వాక్సిన్ ను ఇవ్వాలని కోరారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 16 నుండి ఈ వాక్సిన్ ప్రక్రియ కొనసాగనుంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ను సిద్దం చేస్తోంది. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖ పై పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి.