సీఎం జగన్ కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ..!

Thursday, June 10th, 2021, 12:19:09 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. అయితే ఈ నెల నుండి వృద్ధాప్య పింఛన్లను 2,750 రూపాయలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఏడాది గా ఉన్న పెండింగ్ పింఛను మూడు వేల రూపాయలను కూడా కలిపి ఇవ్వాలి అంటూ లేఖ లో సీఎం జగన్ ను కోరారు. అయితే ఎన్నికల సమయం లో వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే రెండు వేల నుండి మూడు వేలకు పెంచుతాం అని హామీ ఇవ్వడం ద్వారానే వైసీపీ కి ప్రజల నుండి పూర్తి మద్దతు వచ్చింది అంటూ లేఖలో వివరించారు. అయితే దీనికి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.