భూ దందా కోసమే ఆ పథకం…ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

Wednesday, March 31st, 2021, 04:18:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరోమారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పేద ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సరసమైన ధరలకు ఇళ్ళ పట్టాల పేరుతో మరో పథకానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడుతోంది అని వ్యాఖ్యానించారు. అయితే మరో భూ దందా కోసమే ఆ పథకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జిల్లా కేంద్రాల్లో లే అవుట్ లు అభివృద్ది చేసి ఇస్తామనడంలో దందా కోణం ఉన్నట్లుంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ప్రభుత్వం ఉద్యోగులకు టూ వీలర్స్ ఇస్తామంటున్నారు అని, అయితే పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే వీటికి ఎక్కడి నుండి తెస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే పశువులకు అంబులెన్స్ అంటూ మరొక పథకం పెట్టారు అని, దానికంటే పశు వైద్యులకే టూ వీలర్స్ ఇచ్చి అక్కడికి పంపితే బావుంటుంది అంటూ సూచించారు. అయితే గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లో వేసుకుంటున్నారు అంటూ ఆరోపించారు. సర్పంచ్ ల అధికారాలను లాక్కుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఆయన పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా మొక్కవోని ధైర్యం తో ముందుకు వెళ్ళారు అని, ఆయనకు పదవి విరమణ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.