జగన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోంది – రఘురామ కృష్ణంరాజు

Tuesday, March 30th, 2021, 05:20:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టేపథకాలన్నీ బాదుడు గా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రఘురామ కృష్ణంరాజు. అంతేకాక సీఎం జగన్ పరిపాలన విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళా ఆంధ్ర ప్రదేశ్ గా మారుతుంటే సీఎం జగన్ తీరు మాత్రం నీరో చక్రవర్తిని తలపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మితిమీరిన అప్పులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్తితి నడిసంద్రం లో నావలా తయారైంది అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక పై అప్పులు కూడా పుట్టే పరిస్ఠతి ఉండదు అంటూ తేల్చి చెప్పారు. అయితే నాసిరకం మద్యం మరియు అధిక ధరలతో ఆదాయం పెంచుకున్నారు అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి పై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు.