మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వండి…సీఎం జగన్ కి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Monday, June 29th, 2020, 04:50:13 PM IST

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలకు వైసీపీ తరపున ఎంపీ విజయ సాయి రెడ్డి రఘురామ కృష్ణంరాజు కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం పై ప్రతి స్పందన కూడా వివరించారు. ఆ పార్టీ స్థానికంగా ఉంది అని, జాతీయ పార్టీ కాదు అని, షోకాజ్ నోటీసులలో పేర్కొన్న పార్టీ పేరు వ్యవహారం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక కేంద్ర ఎన్నికల సంఘం ను కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపధ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి కి ఒక లేఖ రాశారు.

అయితే ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది.తాను వేంకటేశ్వర స్వామి కి అపర భక్తుడు అని, శ్రీవారి ఆస్తుల అమ్మకం విషయం లో భక్తుల మనోభావాల విషయం ను వివరించా అని చెప్పుకొచ్చారు. అంతేకాక హిందువులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించ కూడదు అని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు అని తేల్చి చెప్పారు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వండి అని జగన్ కి లేఖలో పేర్కొన్నారు. ఇసుక అంశం పై కూడా జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే అలా కుదరక మీడియా ముందు వివరించాను అని వ్యాఖ్యానించారు.

పార్టీకి గాని, మీ పైన గాని ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పార్టీ లో కొందరు క్రైస్తవ వ్యతిరేకి గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక కలవనీయకుందా చేస్తుంది ప్రజా ప్రతినిధులు అని లేఖలో దిమ్మ తిరిగే వాస్తవాలను వివరించారు. మరి ఈ విషయం ఇంకా వివాదం కాకుండా ఉండాలి అంటే సీఎం జగన్ ఈ విషయం పై స్పందించాలి. మరి దీని పై ఇంకేలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.