సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ.. ఏం కోరారంటే?

Thursday, September 10th, 2020, 12:01:36 AM IST


ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయని ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏ ఏ అంశాలు లేవనెత్తాలి, ఎలా స్పందించాలి అనే అంశంపై సమగ్రంగా చర్చించాలని లేఖ ద్వారా కోరారు.

అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, మరికొన్న అంశాలు అసలు కేంద్రం వద్దకు వెళ్ళలేదని దానికి అధికారుల అలసత్వమే కారణమని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు గతంలో సీఎంలు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయిగా వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను ఆహ్వానించాలని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.