అమరావతి పర్యటనకు అనుమతి ఇవ్వండి – రఘురామ కృష్ణంరాజు

Thursday, August 20th, 2020, 10:49:03 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రం లో పలు సమస్యలతో ప్రజలు బాధపడుతున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజలకు మరింత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మేరకు అమరావతి పర్యటనకు అనుమతి ఇవ్వాలి అంటూ వైసీపీ నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది.

అయితే ఈ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కి రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఈ నెల 24 న అమరావతి లో పర్యటించాలని భావిస్తున్నట్లు ఆ లేఖ లో వివరించారు. ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అమరావతి లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎటువంటి ఆటంకాలు రాకుండా కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ పర్యటిస్తా అని అందులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.