అసలు మీ పాలసీ ఏమిటీ.. జగన్ సర్కార్‌కు రఘురామ సూటి ప్రశ్న..!

Monday, September 7th, 2020, 03:07:25 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన రథం కాలిపోవడం కుట్రగానే అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రథాన్ని ఎవరు తగులబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు.

సీం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. రెండు దేవాలయాలకు కలిపి ఒక ఈవోని నియమిస్తారా అంటూ హిందూ దేవాలయాలు అంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అంతర్వేదిలో సీసీకెమెరాలు పనిచేయడం లేదని, ఈ విషయంలో దేవాదాయశాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడమేంటి అని నిలదీశారు.