రాజధాని పై మీరు మాట తప్పారు కాబట్టి, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి

Monday, September 14th, 2020, 02:50:00 PM IST

Raghurama-Krishnam-Raju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజా పరిణామాల తో రాజకీయాలు వేడెక్కాయి అని చెప్పాలి. తాజాగా పార్టీ సమీక్షకు తనను పిలిచినట్లే పిలిచి, మళ్లీ అంతలోనే ఆంధ్రా భవన్ అధికారులు వద్దు అని చెప్పారు అని మీడియా సమావేశం లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం తో తనను పార్టీ నుండి బహిష్కరించినట్లే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు.

అయితే అమరావతి ను రాజధాని గా కొనసాగిస్తా అని చెప్పి మాటలు తప్పిన వారే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం హయం లో అమరావతి ను రాజధాని గా ప్రకటించగా, నాటి ప్రతి పక్ష పార్టీ వైసీపీ సైతం అమరావతి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు మూడు రాజధానుల పై నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రఘురామ కృష్ణంరాజు కి ఇలా చేయడం ద్వారా, తనకు విప్ జారీ చేసే అవకాశం ఉంది అని తెలిపారు. అమరావతి లోనే రాజధాని ఉంటుంది అని కుహనా మేధావులు అన్నారు అని, ప్రజలకు ఇచ్చే హామీకి మీరు వ్యతిరేకం గా ప్రవర్తించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మాట తప్పారు కాబట్టే, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పై, వైసీపీ నేతల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు మరొకసారి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.