ఆకు రౌడీలు బెదిరిస్తే భయపడను.. ఎంపీ రఘురామకృష్ణంరాజు సీరియస్..!

Friday, September 18th, 2020, 03:15:10 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. అయితే ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న తన కార్యాలయం పేరును మార్పించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం అని ఉండగా తాజాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరును పెట్టించారు. అంతేకాదు ఫ్లెక్సీల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫోటోలను తీయించేశారు.

ఇక పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీల ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన రఘురామ వైసీపీ ఎంపీలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కోర్టులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని అన్నారు. అయితే నా సహచర ఎంపిలతోనే నన్ను కొట్టిస్తా అంటూ నీచంగా మాట్లాడిస్తున్నారని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని నేను భయపడనని, నా ఒంటిపై చేయి పడితే నన్ను కాపాడేందుకు హేమహేమీలు ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే పులివెందులలో 10 వేల మందితో సమావేశం పెడతానని అక్కడ నన్ను ప్రేమించే వారు చాలా మంది ఉన్నారని అన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నిస్తుందని ఆ దమ్ము వారికి లేదని అన్నారు.