జగన్ సర్కార్‌పై మరోసారి మండిపడ్డ ఎంపీ రఘురామ కృష్ణంరాజు..!

Saturday, September 5th, 2020, 11:00:36 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ సర్కార్‌పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి మండిపడ్డారు. సింహాచలం భూముల్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అప్పన్న ఆస్తుల్ని కాపాడుకునే బాధ్యత విశాఖ వాసులు భుజాలపై వేసుకోవాలని అన్నారు. వేల ఎకరాల సింహాచలం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా తొలగించడం దురుద్దేశంతో కూడుకున్నదే అని అన్నారు.

అయితే అశోక్‌గజపతిరాజు మచ్చలేని వ్యక్తి అని కుటుంబ వ్యవహారాల్లోకి చొరబడి రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. గజపతిరాజును తొలగించేందుకు ప్రభుత్వం సరైన కారణాలు చూపలేకపోయిందని, వందల ఏళ్ల సంప్రదాయాన్ని కాలరాసి ఆనందగజపతిరాజు మొదటి భార్య రెండో కుమార్తె సంచయితను రాత్రికి రాత్రే ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆమెను అడ్డుపెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులను నియమించి దేవుడి ఆస్తులను కొట్టేసే ప్లాన్ వేశారని విమర్శలు గుప్పించారు.