సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాల్సిందే.. ఎంపీ రఘురామ జోస్యం..!

Friday, November 13th, 2020, 04:55:03 PM IST

MP-Raghurama-Krishnam-Raju

ఏపీ సీఎం జగన్ ఇక రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉండాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్‌ సిద్ధంగా ఉండాలని అన్నారు. అయితే చేసిన తప్పు ఒప్పుకుని కోర్టులను క్షమాపణ కోరితే జగన్‌కు శిక్ష తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే అని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని అన్నారు.

అయితే సింహాద్రి, మాన్సాస్‌ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని ఆరోపించారు. సీఎం జగన్‌ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని అది మానుకోవాలని సూచించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజం కానీ, వైసీపీ పెద్దలు మాత్రం జడ్జిల చిత్తశుద్ధి మీదే అనుమానాలున్నాయంటూ పెద్ద వివాదానికి తెరలేపారని అభిప్రాయపడ్డారు. ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వారే పడతారు అన్న సామెత వైసీపీకి బాగా సూట్ అవుతుందని రఘురామ ఎద్దేవా చేశారు.