సీఎం జగన్ వెనుక కుట్ర జరుగుతుంది.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, March 9th, 2021, 05:32:30 PM IST

ఏపీ సీఎం జగన్ వెనుక భారీ కుట్ర జరుగుతుందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు జరగరానిదేమన్న జరిగితే అన్న ఉద్దేశంలో సీఎం జగన్ వెనుక కుట్ర ఏమైనా జరుగుతుందేమోనని, ఇటువంటి కుట్రలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందని అనుకోవడం లేదని కానీ అందులో ఎంతో కొంత నిజం లేకపోతే రిపబ్లిక్ టీవీ‌లో వార్తలు రావని అన్నారు.

అయితే మా పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కనుక, నన్ను ఇంకా పార్టీలో ఉంచారు కనుక ఆయనకు నేనిచ్చే సలహా ఏమిటంటే రిపబ్లిక్ టీవీ వార్తను అంత తేలిగ్గా కొట్టిపడేయొద్దని, మీ వెనుక ఎవరైన కుట్ర చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉందని, మీపై ఉన్న గౌరవంతో ఈ మాటలు చెబుతున్నానని ఆలోచించి నిజమైన బ్లాక్ షీప్‌ను పట్టుకోండని సూచించారు. అంతేకాదు నిత్యం మీతోనే ఉంటూ భజన చేసే వాళ్లు ఎవరైనా గోతులు తీస్తున్నారేమో చూసుకోవాలని రఘురామ అన్నారు.