జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు – ఎంపీ రఘురామ

Friday, October 9th, 2020, 03:40:30 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు మీడీయాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగతి కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. తన ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. వైసీపీ నేతలకు మానసిక సమస్యలు పెరిగిపోయాయని సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.

అయితే పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో కోర్టులు జగన్ గూబ పగలకొట్టాయని ఎద్దేవా చేశారు. అయితే టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానని అన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి మూడు ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని, ఏడు కొండలు, ఏడుగురు రెడ్లు అన్నట్టుగా తిరుమల తయారైందని అభిప్రాయం వ్యక్తం చేశారు.