మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు – రఘురామ కృష్ణంరాజు

Monday, August 10th, 2020, 03:12:17 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని అంశంపై మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చిందని అన్నారు.

మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి రైతుల వైపే న్యాయం ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయని అన్నారు.