అంతర్వేది రథం దగ్ధం పై సీఎం జగన్ స్పందించాలి – ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Monday, September 7th, 2020, 12:00:42 AM IST

Raghurama-Krishnam-Raju

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది లోని నరసింహ స్వామి వారి రథం కాలిపోవడం రాష్ట్ర ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది. కాలిన విధానం చూస్తుంటే కుట్ర ప్రకారమే జరిగింది అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అయితే ఈ ఘటన పై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా స్పందించాలి అని రఘురామ కృష్ణంరాజు కోరారు. మతి స్థిమితం లేని చర్యగా వదిలి వేయకుండా, డిజిపి తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరారు. అర్దరాత్రి ఒంటిగంట సమయంలో రథం కాలిపోవడానకి కారణం ప్రమాదమా లేదంటే ఆకతాయిల పనా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలప తో చేయడం జరిగింది, ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవం లో భాగం గా ఇక్కడ రధోత్సవం జరుగుతుంది. దీని పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలి అని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.