వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ కోర్టు ధిక్కారణకు పాల్పడిన వారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని సీఎం జగన్ కూడా తన పదవి కోల్పోవల్సి వస్తుందని అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదని అన్నారు.
అయితే న్యాయవ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని, న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణగా పరిగణించాలని అన్నారు. న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పి జగన్ సీఎంగా కొనసాగాలని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని రఘురామ అన్నారు. అయితే జగన్ తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి కూడా సీఎం కావచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ వివేకా హత్య కేసును సెక్షన్ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.