నూటికి నూరుపాళ్లు అమరావాతే రాజధాని.. ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు..!

Thursday, August 13th, 2020, 01:55:34 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అమరావతిపై రఘురామకు సంబంధం ఏమిటని అంటున్నారని, నేను పుట్టింది.. పెరిగింది బెజవాడలోనే అని రాజధానిపై నాకే సంబంధం ఉంటుందని అన్నారు. త్వరలోనే అమరావతికి వస్తానని, రైతులు ధైర్యంగా ఉండాలని నూటికి నూరుపాళ్లు అమరావతే రాజధానిగా ఉంటుందని అన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తుందని, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై అనుచిత కామెంట్లు చేశాడని ఆయనపై సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని జగన్‌కు సూచించారు. చైర్మెన్ వంటి పోస్టులు రెడ్లకు కట్టబెడుతున్నారని, ప్యూన్ వంటి పోస్టులు ఎస్సీలకో, బీసీలకో కట్టబెడుతున్నారంటూ విమర్శలు గుప్పించాడు. ప్రజల్లోకి వెళ్తే ఈ విషయాలన్ని తెలుస్తాయని అన్నారు.