నా మనువడికి వైఎస్ పేరు పెట్టుకున్నా- ఎంపీ రఘురామకృష్ణంరాజు

Wednesday, September 2nd, 2020, 01:07:16 PM IST

ప్రజా ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలోని ఆయన నివాసంలో వైఎస్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి గారితో తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉందని, నా మనువడికి కూడా ఆయన పేరే పెట్టానని అన్నారు.

అంతేకాదు తన పంచెకట్టు వైఎస్ఆర్ నుంచి కాపీ చేసిందేనని అన్నారు. అయితే నేడు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రాజకీయ అంశాలపై మాట్లాడనని కేవలం వైఎస్ గుణగణాలు, ఆయన వ్యక్తిత్వం గురుంచి మాత్రమే మాట్లాడగలనని అన్నాడు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఏ స్కీమ్ పెట్టినా తన పేరు ఎప్పుడూ పెట్టుకోలేదని ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లనే పెట్టేవారని అన్నారు. విపక్ష నేతలను కూడా వైఎస్‌ ఎంతో గౌరవించేవారని అందుకే చనిపోయిన తర్వాత కూడా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.