నా జోలికి రాకండి.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అల్టీమేట్ వార్నింగ్..!

Friday, August 14th, 2020, 03:49:10 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను రాజీనామా చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న వారికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మొన్న ఒక వైఎస్ రెడ్డి.. నిన్న రామిరెడ్డి ఇలాంటి వారు నన్ను రాజీనామా చేయాలంటూ ఏదేదో మాట్లాడుతున్నారని నా ఇంటి దగ్గరకు వస్తే సీఆర్‌పీఎఫ్ వాళ్లు షూట్ చేసేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

అంతేకాదు తాను ప్రజామోదంతో గెలిచానని, నా విజయంలో జగన్ బొమ్మ 90 శాతం కారణం అయితే, నా బొమ్మతో కూడా నెగ్గానని అలాంటిది నేనెందుకు రాజీనామా చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు రాజీనామా చేయాల్సింది మీరు అని అన్నారు. నా జోలికి రాకండి, మీ పరిధిల్లో మీరు ఉండండి అని అన్నారు. నాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోమని చెబుతున్నా చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ పట్టించుకోవడం లేదని దీనిపై లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేశానని అన్నారు. లోకాయుక్త కూడా పట్టించుకోకపోతే నేను చేయాల్సింది చేస్తాను అంటూ మండిపడ్డారు.