సీఎం జగన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!

Wednesday, October 7th, 2020, 04:22:25 PM IST

Raghurama-Krishnam-Raju

ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నేడు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామ ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తాడు. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకుంటే తనలా వృద్ధిలోకి రావొచ్చని జగన్‌ అనుకుంటున్నాడేమో? గుజరాతీ మీడియంలో చదివిన మోదీ ప్రపంచ నాయకుడు అయ్యారన్న విషయాన్ని జగన్ గుర్తించుకోవాలని అన్నారు. ఎవరికి నచ్చిన మీడియంలో వారు చదువుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందని, అధికారం ఉంది కదా అని రాజ్యాంగాన్ని కూడా మారుస్తామంటే ఎలా అని అన్నారు.

ఇక వైసీపీ నేతలు కొందరు తాను బీజేపీలో చేరుతున్నానని అంటున్నారని ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పిందని, కానీ వైసీపీ సొంత ప్రచారం చేసుకుంటుందని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారని ప్రత్యేక హోదాపై జగన్‌కు అంత ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని అప్పుడు తాను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్దమని అన్నారు.