మళ్లీ కంప్లైంట్లు ఇచ్చి సమస్యలు కొనితెచ్చుకోవద్దు.. జగన్ సర్కార్‌కు రఘురామ సజేషన్..!

Tuesday, November 3rd, 2020, 05:46:23 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వానికి ఓ సజేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టిందని, స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఎన్నికల కమీషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని దానిని కాపాడుకోవాలని హైకోర్టు చెప్పుకొచ్చిందని రఘురామ అన్నారు.

అంతేకాదు ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయని కానీ రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయని అలాంటి వాటి పట్ల సరైన తీరుతో వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్ట్ ఘాటుగా హెచ్చరించింది. అందుకే మళ్ళీ ఇలాంటి వాటిపై కంప్లెయింట్ ఇచ్చి సమస్యలు తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి రఘురామ సూచించారు. ఇక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాశారని కానీ దానికి ఎవరూ భయపడలేదని అన్నారు. అయ్యిందేదో అయ్యింది క్షమాపణలు చెప్పి ఇకనైనా న్యాయవ్యవస్థను గౌరవించుకుందాం అని ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు.