కొడాలి నాని వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!

Tuesday, September 8th, 2020, 05:30:02 PM IST

Raghuramkrishnamraju

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఓ పక్క గత 266 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు నిరసనలు తెలుపుతుంటే, మంత్రి కొడాలి మాత్రం అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎం జగన్‌కు తాను చెప్పానని అన్నారు.

అయితే అమరావతిపై ప్రభుత్వ వైఖరి ఏంటో మంత్రి కొడాలి నాని బయటపెట్టారని, రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలన్న ఉద్దేశ్యాన్ని ఆయన బట్టబయలు చేశారని ఎంపీ రఘురామ మండిపడ్డారు. అంతేకాదు మంత్రి కొడాలి పితృ భాషను ఎక్కువగా వాడుతున్నారని అది కాస్త తగ్గించుకోవాలని అన్నారు. రాజధాని తరలింపుపై కేసులు ఉపసంహరించుకోకుంటే ఉన్న ఈ చిన్న రాజధానిని కూడా తరలిస్తామని కొడాలి నాని బెదిరిస్తున్నట్టు ఉందని అన్నారు.