ఆ సవాల్ స్వీకరిస్తా.. మరి అందుకు రెడీనా – ఎంపీ రఘురామకృష్ణంరాజు

Friday, March 12th, 2021, 02:09:09 AM IST

Raghurama-Krishnam-Raju

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రఘురామకృష్ణంరాజు దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. అయితే దీనిపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని అన్నారు. అయితే దానికంటే ముందు తాను కూడా ఒక సవాల్ విసురుతున్నానని, తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అప్పుడు పెద్దిరెడ్డి సవాల్‌కు తాను సిద్ధమని తెలిపారు.

అయితే నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను జగన్ పార్టీలో చేరానని అన్నారు. నేను గనుక సీఎం అయితే అన్న నీ మాటల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డిని రఘురామ ప్రశ్నించారు. చంద్రబాబుకు నేను బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, రాజకీయంగా నాకు చంద్రబాబు ఉన్నత స్థానం ఇచ్చారని, చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదని అన్నారు. నేను సీఎం జగన్‌ను ఎప్పుడూ విమర్శించలేదని, ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని రఘురామ చెప్పుకొచ్చారు. జగన్ ఫోటోతో మాత్రమే తాను ఎంపీగా గెలవలేదని, నా వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందని అన్నారు.