మాన్సస్ ట్రస్టు ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారు – ఎంపీ రఘురామ

Tuesday, November 3rd, 2020, 03:00:45 AM IST

Raghurama-Krishnam-Raju
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతి రాజు గురుంచి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆనంద్ గజపతి రాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతి రాజు విడాకులు తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారని, ఆ తర్వాత సంచయిత తల్లి ఉమా గజపతి రమేశ్ శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారని అన్నారు. అయితే సంచయిత తన తల్లిదండ్రుల గురించి ఓ ఆర్టికల్‌లో స్పష్టంగా తెలుపిందని, స్కూల్ రికార్డులలో కూడా తన తండ్రి రమేశ్ శర్మ అనే ఉందని అన్నారు.

అయితే ఆనంద్ గజపతి రాజు కూడా విజయనగరానికి చెందిన సుధా రాజును మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. అయితే వీరిద్దరికి పుట్టిన సంతానం ఊర్మిళా గజపతి రాజు అని అన్నారు. ఆనంద్ గజపతి రాజు కూడా తన వారసురాలిగా ఊర్మిలా పేరునే ప్రకటిస్తూ వీలునామాలో కూడా రాశారని అన్నారు. అయితే ఇటీవల జరిగిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో సంచయిత వ్యవహరించిన తీరు నిజంగా దారుణమని రఘురామ అన్నారు. అయితే సంచయితను అడ్డుపెట్టుకుని మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారని అమ్మా సంచయిత ఎవరి అండ చూసుకుని చెలరేగిపోతే కోర్టులు చూస్తూ ఊరుకోబోవని, ట్రాప్‌లో పడకండని సూచించారు.