వైసీపీ నుంచి నన్ను బహిష్కరించే దమ్ము లేదు – ఎంపీ రఘురామ

Thursday, September 17th, 2020, 02:02:51 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరున్నరేళ్లుగా మోదీ అనేక సమస్యలు పరిష్కరించి తిరుగులేని ప్రధానిగా నిలిచారని అన్నారు. అయితే వైసీపీ గురుంచి కూడా మాట్లాడుతూ తనను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ములేక పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని అన్నారు.

అయితే ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే సీఎం జగన్ వెనుక ఉన్న వారే ఆయనను మోసం చేస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద మహానటులు మీ వెంట ఉన్నారని దయచేసి వారు చెప్పేవి మీరు నమ్మకండి జగన్ గారు అని చెప్పుకొచ్చారు. మీది నాది వన్‌సైడ్ లవ్ అని మీరు నన్ను ప్రేమించడం లేదని మీరు ప్రేమించకపోతే నేను ఇంకొకరిని చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు.