జగన్ మనసు తెలియకనే వైసీపీలో చేరా – ఎంపీ రఘురామకృష్ణంరాజు

Wednesday, October 14th, 2020, 11:27:31 PM IST


ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నీరో చక్రవర్తిలా మారారని ఆయన మనసు తెలియక తాను వైసీపీలో చేరానని అన్నారు. ఏపీలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని దీనిపై రాష్ట్రపతికి లేఖ రాశానని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రస్తుతం పాలెగళ్ల పరిపాలన నడుస్తుందని అన్నారు.

అయితే ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఒక పాలెగాడు అని, మా నియోజకవర్గంలో ఓ పాలెగాడు ఆవ భూముల్లో అవినీతికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. సీఎం బాబాయ్ ఆవ భూముల్లో అవినీతి చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పార్లమెంట్‌లో మీ సామాజికవర్గం వారికే ఎక్కువ పదవులు ఇచ్చారని అన్నారు. ఇక జగతి పబ్లికేషన్స్‌లో బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేశానని దీనిపై కూడా త్వరలో విచారణ జరుగుతుందని అన్నారు.